_రుద్రారం లో ఒక కోటి 76 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
_అతి త్వరలో 10 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనుల శంకుస్థాపన
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఒక కోటి 76 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనం, అంబేద్కర్ యువజన సంఘం, బుడగ జంగాల సంక్షేమ సంఘం భవనాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సహకారంతో గ్రామ పంచాయతీల భవనాలతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.అతి త్వరలో రుద్రారం గ్రామంలో లాటిక్రేట్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు.గత పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రుద్రారంలో నూతన భవనాల నిర్మాణాలకు ఒక కోటి 16 లక్షల రూపాయలు కేటాయించిన ఎం ఎస్ ఎన్ పరిశ్రమకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, పంచాయతీరాజ్ డిఇ సురేష్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…