గీతం విద్యార్థులతో ముఖాముఖిలో కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజు వ్యాఖ్య
మనవార్తలు , పటాన్ చెరు:
దురదృష్టవశాత్తు అవినీతి దేశ నెతికతనే దెబ్బతీస్తోందని , అవసరం ఆధారిత , దురాశతో కూడిన అవినీతి క్రమంగా పెచ్చరిల్లుతోందని , దానిని అదుపు చేయగలిగినప్పుడే మనదేశం ఫలవంతమైన గమ్యాన్ని చేరుకోగలదని కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి , 1991 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ , ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ రాజు నారాయణ స్వామి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ విద్యార్థులతో మంగళవారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు . గీతం విద్యార్థి విభాగాలు దిశ , సీఎస్ఐలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో , ‘ కంప్యూటర్ సెన్స్డ్ కొత్త సరిహద్దులు విహంగ వీక్షణం ‘ అనే అంశంపై ఆయన తొలుత ప్రసంగించారు . ఆ తరువాత విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు .
విద్య అక్షరాభ్యాసంతో ప్రారంభం కాదని , తల్లి చూపుతో , తండ్రి పరిశీలనతో మొదలవుతుందని , అక్షరాస్యత విద్య యొక్క ముగింపో , ప్రారంభమో కాదని , విద్య మానవతావాదం కోసం , సహనం కోసం , ఆలోచనల సాహసం కోసం , సత్యాన్వేషణ కోసం జరగాలని , అంతిమంగా విద్య ఒకరిని మంచి మనిషిగా తీర్చిదిద్దాలని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు . నిరంతర పరిశోధనలతో కంప్యూటర్ సామర్థ్యాన్ని అపరిమితంగా పెంచుతున్నారని , ఫజ్జీ లాజిక్ ద్వారా ఒకనాటికి అందాల పోటీలలో కంప్యూటరే న్యాయనిర్ణేత కాలగదని డాక్టర్ రాజు జోస్యం చెప్పారు . అంతరిక్ష పరిశోధనా సంస్థ విజన్ -2075 ని ఉటంకిస్తూ , ఆకాశంలో రెండు లక్షల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్ష కాలనీలు వస్తాయని , జియో శాటిలెన్డ్ స్టేషన్కు లిఫ్ట్లో , అక్కడి నుంచి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళేలా పరిశోధనలు సాగుతున్నట్టు చెప్పారు .
పనిని అంకితభావంతో చేస్తేనే అది విజయవంతమవుతుందని , శ్వేదం చిందించకుండా విలువెనైవేదీ మనకు దక్కదని , విజయ స్ఫూర్తితో ముందుకు సాగాలని , ఘనమైన నాగరికతకు వారసులమని గుర్తించాలని , అప్పుడు మనల్ని ఏ శక్తీ అడ్డుకోలేదని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య సర్ సీ.వీ.రామన్ను ఉటంకిస్తూ డాక్టర్ నారాయణస్వామి చెప్పారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అతిథిని స్వాగతించి , సత్కరించారు . ఈ ముఖాముఖిలో సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ పి.ఈశ్వరయ్య , డాక్టర్ జోసెఫ్ జయకర్ , డాక్టర్ పి.నరసింహస్వామి , సీఎస్ఐ సమన్వయకర్త ఎం.కిరణ్ శాస్త్రితో పాటు పలువురు గీతం విద్యార్థులు పాల్గొన్నారు .