బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ :ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు

Districts politics Telangana

_నీలం కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ 

_భారీగా తరలివచ్చిన అభిమానులు, సబ్బండ వర్గాలు

నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని నినాదాలు చేశారు. స్వచ్చందంగా ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఇంటింటికి ప్రచారం నిర్వహించి మిమ్మల్ని గెలిపించుకుంటామని ధైర్యం ఇచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ జై మదన్న నినాదాలతో హోరెత్తిస్తూ అపూర్వ స్వాగతం పలికారు.నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామంలో జరిగిన ఆంజనేయస్వామి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్టతో నవగ్రహాల విగ్రహ ప్రతిష్టపాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీలం మధు కు ఆయన అభిమానులు, మద్దతు దారులు దారి పొడవునా స్వాగతం పలికారు. కౌడిపల్లి మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వచ్చిన వివిధ బీసీ సంఘాల నాయకులు, ముదిరాజ్ సామాజిక వర్గ నేతలు ఆయనకు మద్ధతుగా తరలి వచ్చారు. బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా అడుగులు వేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు ముదిరాజ్ ను అభినందించారు.సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న మీ వెంట తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు. అనంతరం సదాశివపల్లి లో శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజ స్తంభ, నవగ్రహల ప్రతిష్టపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం అలవాడుతుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి నుంచి బయటపడడానికి, మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని సూచించారు. తనను అభిమానిస్తూ ఘన స్వాగతం పలికిన అభిమానులు, మద్దతుదారులు,  ప్రజల ప్రేమాభిమానాలు మర్చిపోలేనన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాలని అందరూ కోరుతున్నారని, తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని ఈ విషయంపై త్వరలో సానుకూల నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. మీ ప్రేమాభిమానాలు స్ఫూర్తిగా భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మటురి శాఖయ్య, పాండు , స్థానిక సర్పంచ్ నర్సింగరావు, మాజీ జెడ్పీటీసీ జగదీశ్వర్,మాజీ సర్పంచ్ వీరయ్య,దేవరాజు,దుర్గయ్య, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *