madhapur

మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నగేష్ నాయక్ నియామకం పట్ల హర్షం

politics Telangana

శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి :

శేరిలింగంపల్లి నియోజక వర్గం మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా గత ఎన్నికలలో కాంగ్రెస్ కంటేస్తెడ్ కార్పొరేటర్ డి. నగేష్ నాయక్ ను నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, హర్షంవ్యక్తంచేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాదాపూర్ చంద్ర నాయక్ తండాలో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.బి.సి ఛైర్మెన్ జెరిపేట్ జైపాల్ హాజరై నగేష్ నాయక్ ను శాలువా కప్పి సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం జేరిపెట్ జైపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు గా కొనసాగుతూ ఆగస్టు లో మరణించిన డి.సురేష్ నాయక్ ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, పి. సి. సి ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ లు పార్టీ కోసం కృషి చేసిన వారి సేవలను తప్పక గుర్తిస్తూ పార్టీ నిర్మాణం లో వారికి కీలక పదవులు ఇవ్వడం ప్రారంభించారని అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, అధికారంలో లేనపుడు పార్టీకి విశిష్ట సేవలు అందించిన వారి స్ఫూర్తితో వారి సోదరులు నగేష్ నాయక్ కార్పొరేషన్ ఎన్నికలలో మదాపూర్ కార్పొరేటర్ గా నిలబడడం జరిగిందని,. సురేష్ నాయక్ తండ్రి, వారి చిన్నానల నుండి నగేష్ నాయక్ వరకు 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండా వీడ లేదని కాంగ్రెస్ పార్టీ పట్ల వారి కుటుంబానికి ఉన్న విధేయతకు ఇదే నిదర్శనం అని అలాంటి కుటుంబం నుండి వచ్చిన నగేష్ నాయక్, సురేష్ నాయక్ సతీమణి డి. లక్ష్మీ ప్రసన్న ల యొక్క సేవలను వినియోగించుకోవడానికి పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న వారికి నేడు అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు.

శేరిలింగంపల్లి కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ నగేష్ నాయక్ మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ గా నియామకం అవడం అంకిత భావంతో పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేడర్ కీ ఇస్తున్న ప్రాధాన్యత ను చూసి మేము గర్విస్తున్నాం అని అన్నారు. ఇతర పార్టీలలో ఉన్న నాయకులు కాంగ్రేస్ పార్టీ యే బీద, బడుగు వర్గాల కొండంత అండగా ఉంటుంది, అభివృద్ది కాంగ్రెస్ పార్టీ తో నే సాధ్యం అని అన్నారు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల వారు చేరిన మంచిదేనని కానీ సీనియర్ నాయకులు ఐన వారిని వారి సేవలను తప్పక గుర్తించే విజన్ కాంగ్రెస్ పార్టీదని అన్నారు.విద్యాధికులు, అద్భుత ప్రసంగికులు అయిన యుక్తి, శక్తి ని వారి కుటుంబ సభ్యుల ఆవశ్యకత ను గుర్తించి మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ కి క్యాడర్ తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన మా సోదరుడు ఒక ఆశావాద సంకల్పం తో పెద్దలు జేరి పెట్ జైపాల్, పి.సి.సి ప్రతినిధి సత్యంరావు ల ప్రోత్సాహం పార్టీ కార్యకలాపాలలో విరివిగా అవిశ్రాంతంగా పాల్గొనేవారనీ తెలిపారు.. పార్టీ కి సేవలు అందించిడం యే ఆయన తొలి ప్రాధాన్యత తరువాతే కుటుంబం అని సురేష్ నాయక్ సతీమణి లక్ష్మి ప్రసన్న అన్నారు. మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సేవలో మా కుటుంబం నుండి నగేష్ నాయక్, సురేష్ నాయక్ వారసత్వాన్ని కొనసాగిస్తాడని మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా ప్రజా సేవకీ అంకిత భావంతో పనిచేస్తాడని తెలిపారు. మాదాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నియామకం అవడానికి సహకరించిన ఎంబిసి ఛైర్మెన్ జేరిపెట్ జైపాల్ , పి. సి. సి ప్రతినిధి సత్యం రావు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి. జగదీశ్వర్ గౌడ్, మ్మెల్యే గాంధీ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, మారెళ్ళ శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంటు ప్రేమ్ కుమార్, హనీఫ్, సద్దాం, లక్ష్మి ప్రసన్న, లక్ష్మి, సర్దార్,నరేష్ లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *