మనవార్తలు ,హైదరాబాద్:
సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో పాషన్ నేచర్ వెల్‌నెస్ ఫౌండేషన్‌ను నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి ప్రారంభించారు. PNM ఫౌండేషన్‌తో పాటు JG ఫ్యాట్ టు ఫిట్ సెంటర్ కూడా ప్రారంభించారు. ప్రకృతి వైద్యుడు రాజేందర్ డెల్లికర్ వివిధ అంశాలతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ప్యాషన్ వెల్నెస్ ఫౌండేషన్ సహజ పదార్ధాలను ఉపయోగించి సేంద్రీయ విధానంపై దృష్టి పెడుతుంది.
లాంచ్‌లో నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి మాట్లాడుతూ “నేను రాజేందర్‌తో మాట్లాడానని వారు అనుసరిస్తున్న ప్రక్రియ గురించి నాకు అర్థమైందన్నారు. వారు మంచి ఆరోగ్యం కోసం అన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పర్యావరణంలో చాలా సహజమైన ఉత్పత్తులు మనం నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ సేంద్రీయ ఉత్పత్తులను ఎక్కువగా తినాలని వారు తెలిపారు.
ప్యాషన్ వెల్నెస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజేందర్ డెల్లికర్ మాట్లాడుతూ నార్త్ జోన్ డిసిపి చందన దీప్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, సహజంగా లభించే ఉత్పత్తులతో అనేక వ్యాధులను నయం చేయవచ్చన్నారు. సహజమైన పద్ధతిని అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తికి ఉన్న వ్యాధిని నయం చేయవచ్చన్నారు.
(జెజి ఫ్యాట్ టు ఫిట్ సెంటర్) వ్యవస్థాపకులు జోస్నా గోస్వామి మాట్లాడుతూ వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్యాషన్ నేచురల్ వెల్నెస్ ఫౌండేషన్ నిజంగా సహాయం చేస్తుందన్నారు. నేను బాడీ ట్రాన్స్‌ఫార్మర్‌ని. మేము స్థూలకాయులకు వారి బరువును తగ్గించుకునేందుకు తగు సహాయం చేస్తామన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఎన్నో మంచి ఫలితాలను సాధించామన్నారు. మేము JG ఫిట్ నుండి వచ్చే మొత్తం డబ్బును PNW ఫౌండేషన్‌కి అందజేస్తామన్నారు.