కెసిఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలో పడ్డాయి: బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )

తెలంగాణ సెంటిమెంటుతో బంగారు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడని, తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని, గుంటనక్క గా మారి తెలంగాణలో స్మశానంగా మారుస్తున్నాడని ఓబీసీ మోర్చ జాతీయ అద్యక్షలు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ముత్తంగిలో మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఓబీసీ జిల్లా స్థాయి సదస్సులో పాల్గొన్న ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలికే రోజు త్వరలోనే ఉందన్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

నేడు ప్రపంచం మోడీ వైపు చూస్తోందని కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశ ప్రజలను అధోగతి పాలు చేయడానికి నడుంబిగించాడన్నారు. మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతోందని, భాజపా కార్యకర్తలు మునుగోడు విజయం కోసం స్వచ్ఛందంగా పని చేస్తున్నారన్నారు. ఓబీసీల సంక్షేమం కోసం తాము అవిశ్రాంత పోరాటం చేస్తున్నామని, కెసిఆర్ రాక్షస ప్రభుత్వం జిల్లాలో గొల్ల, కుర్మలకి అన్యాయం చేస్తే తాము దీటుగా ఎదుర్కొన్నామని . మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి లక్ష్మణ్ ఓబీసీ సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన లక్ష్మణ్ పార్టీలో నూతనోత్సాహం నింపారని జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్, మాజీ శాసనసభ్యులు నందిశ్వర్ గౌడ్, బాబు మోహన్, యువ మోర్చా రాష్ట్ర మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజి రెడ్డి,జిల్లా ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బిట్ల మహేష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, పార్టీ నేతలు జయశ్రీ, నందనం దివాకర్, విఠల్, దేశ్ పాండే, చంద్రశేఖర్, జగన్, మహేందర్, రామకృష్ణ, జగన్నాథ్, హన్మంత్, ఈశ్వరయ్య, నర్సింగ్, సురెందర్, సుధిర్, దేవెందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *