గీతంను సందర్శించిన డీఏవీ విద్యార్థులు

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ఐఐటీ హైదరాబాదు ప్రాంగణంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కోసం ఒక ఆసక్తికరమైన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాస్తుశిల్పం, డిజైన్ ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానదాయన పరిచయాన్ని అందించింది. పాఠశాల విద్యా విజ్ఞాన కార్యక్రమాలలో భాగంగా, డీఏవీలోని 10, 11, 12 తరగతులకు చెందిన 58 మంది విద్యార్థులు, మరో ముగ్గురు అధ్యాపకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్శనలో భాగంగా, పలు ముఖాముఖి కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, విద్యార్థులు చేపట్టిన పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇవి గీతంలోని విద్యా వాతావరణం, సృజనాత్మక సంస్కృతిని వెల్లడించాయి.

స్టూడియో ఆధారిత అభ్యాసం, డిజైన్ ఆలోచన, అంతర్ విభాగ విధానాలతో సహా ఆర్కిటెక్చరల్ విద్య యొక్క ప్రధాన అంశాలను ఆర్కిటెక్చర్ అధ్యాపకులు, విద్యార్థి రాయబారులు పరిచయం చేశారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్. శ్రుతి గావ్లి నిర్వహించిన మందాల కార్యశాల ఈ పర్యటనకే తలమానికంగా నిలిచింది. లయబద్ధమైన సంగీతం నేపథ్యంలో స్టూడియో వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యశాల విద్యార్థులను నమూనా తయారీ, కూర్పు, దృశ్య వ్యక్తీకరణను అన్వేషించేలా ప్రోత్సహించింది. అదే సమయంలో అవగాహన, సృజనాత్మక వాతావరణాన్ని కూడా పెంపొందించింది.అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆర్. స్నిగ్ధా రాయ్, ఆర్. శృతి గావ్లి, విద్యార్థి రాయబారులు మౌన్య, వేదాంశ్ ఫెయిత్, అరిత్ర తదితరులు డీఏవీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆర్కిటెక్చర్ లో కెరీర్ అవకాశాలు, ప్రాంగణ జీవితం, సమస్యల పరిష్కారంలో సృజనాత్మకత యొక్క ప్రాముఖ్యతకు సంబంధించిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. గీతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, ముఖాముఖి సంభాషణలను డీఏవీ బృందం ప్రశంసించింది. ఆర్కిటెక్చర్, డిజైన్ లో కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి ఈ పర్యటన ప్రేరణను ఇచ్చినట్టు వారు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *