మనవార్తలు, శేరిలింగంపల్లి :
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్ ను తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ సన్మానించారు.గత 6 నెలల నుండి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి ,ఇబ్బందులు పెట్టినా ఎంతో దైర్యం గా నిలబడ్డా నేత ఈటెల రాజేందర్ అని. హుజూరాబాద్ ప్రజలను ఎంతో బయబ్రాoతలకు గురి చేసినా,బెదిరించినా ఎక్కడ కూడా దేనికి లొంగకుండా ఈటెల రాజేందర్ ను భారీ మెజరిటి తో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ముదిరాజ్ యువజన సమాఖ్య తరపున కృత్ఞతలు తెలియజేస్తున్నట్లు అయన తెలిపారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచిన ఈటెల రాజేందర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ ముదిరాజ్,లింగస్వమి ముదిరాజ్ ,శ్రీధర్ ముదిరాజ్ ,సురేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.