పాకశాస్త్ర కళకు లింగ భేదం లేదు

Telangana

మాస్టర్ చెఫ్ పోటీలలో స్పష్టీకరించిన నిపుణులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పాకశాస్త్ర కళకు లింగ భేదం లేదని, వంట చేయడం ఒక నైపుణ్యమని, స్త్రీ-పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ అది అవసరమేనని వక్తలు స్పష్టీకరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్-లోని కుకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ‘మాస్టర్ చెఫ్’ పోటీలను ఆద్యంతం ఉత్సాహభరితంగా నిర్వహించారు.గీతం ఆతిథ్య విభాగం సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, పాకశాస్త్ర కళల గురించి అవగాహన పెంచడానికి, లింగ భేదం లేకుండా అందరూ వంటను ఒక నైపుణ్యంగా అలవరచుకోవడానికి ఉద్దేశించారు.విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న సృజనాత్మకత, సమష్టి కృషి, పాకశాస్త్ర నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ పోటీ ఒక వేదికగా తోడ్పడింది. గీతం పాకశాస్త్ర నిపుణుల మార్గదర్శనంలో, ఈ పోటీలలో పాల్గొన్న వారు కేవలం వంటకాల రుచిపై మాత్రమే కాకుండా, వారిలోని సృజనాత్మకత, పోషకాహార పరిజ్జానాలను కూడా ప్రదర్శించారు.గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ప్రధాన చెఫ్, ఆతిథ్య విభాగం సిబ్బంది తదితరులు ఉల్లాసభరితమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని పెంపొందించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *