కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడతాం _సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చుక్కా రాములు

Districts Telangana

 ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళనకు ప్రజా మద్దతు

మనవార్తలు – పటాన్ చెరు

కేంద్ర ప్రభుత్వం రైతు,కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు ఆరోపించారు. పట్టణంలోని శ్రామిక్ భవన్ లో బుధవారం జరిగిన సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ ప్రథమ మహా సభలో చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దని అన్నారు.గత 11నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న వారి సమస్యలు పట్టించు కోవడం లేదన్నారు. ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళనకు ప్రజా మద్దతు ఉందన్నారు.ఇప్పటి వరకూ 650మంది రైతులు ఆందోళనా సందర్భంగా ఛని పోయారని అన్నారు. లఖిం పూర్ ఖేర్ ఘటనలో మరి 5మంది చనీ పోయారని అన్నారు. ఘటనకు సంబంధించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేట్ వారికి ఇచ్చే ప్రక్రియను వేగ వంతం చేసిందని అన్నారు. దేశ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా సంస్థ అనేక లాభాల్లో వుందని అన్నారు.18,500కోట్ల రూపాయల విలువ చేసే సంస్థను కేవలం 2500కోట్ల రూపాయల కు టాటా సంస్థకు అప్పజెప్పడం దారుణమన్నారు. దీనితో పాటు టాటా వారికి వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందన్నారు.రైల్వే,ఓడ రేవులు,ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేట్ వారికి అప్పచెప్పరాని అన్నారు.మానిటైజేషన్, నగ ధికరణతో నేషనల్ హైే వే లను లీజుకు ఇస్తున్నారని అన్నారు.

టోల్గేట్ల వద్ద కార్మికులు లేకుండా ఫాస్ట్ టాగ్ పేరుతో వేలకోట్ల రూపాయలు లాభాలు రాబట్టు కుంటున్నరని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం,రైతులు,వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.పటాన్ చెరు ప్రాంతం కార్మిక వర్గ పోరాటాలకు అనువైన ప్రాంతమని తెలిపారు.ఇక్కడ కార్మిక వర్గం కోసం పని చేయాలని సూచించారు.సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్,కార్య దర్శి వర్గ సభ్యులు జయరాజ్ మాట్లాడారు.ఈ కార్య క్రమంలో ఏరియా కమిటీ కన్వీనర్ నర్సింహారెడ్డి,కమిటీ సభ్యులు పాండురంగా రెడ్డి.నాగేశ్వరరావు,శ్రీనివాసరావు,జార్జ్,ప్రభాకర్,పెంటయ్యలు పాల్గొన్నారు.అనంతరం నూతన కమిటీని ఎన్ను కోవడం జరిగింది.మహాసభ ప్రారంభానికి ముందు పార్టీ పతాకాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *