హోప్ అఫ్ హంగర్ వారి టైలరింగ్ శిక్షణ ధ్రువపత్రాలు అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Hyderabad politics Telangana

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

హోప్ అఫ్ హంగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఆశయంతో ప్రొజెక్ట్ నారీ తేజం పేరుతో మొదటి దశలో భాగంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇరవై మంది నిరుపేద మహిళలకు మూడు నెలల పాటు కుట్టు మిషన్ (స్ట్రిచింగ్) నైపుణ్య శిక్షణ కోర్సును నేర్పించారు. కోర్సు పూర్తిచేసుకున్న మహిళలకు డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా టైలరింగ్ శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందించారు . అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న మహిళలందరు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియచేసారు. డివిజన్ లోని పేద ప్రజలకు సేవ చేస్తున్న హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యకు కృతజ్ఞతలు తెలియచేసారు. మా డివిజన్ లో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని అటువంటి వారికి అండగా నిలుస్తూ ప్రాజెక్ట్ నారీ తేజం లో భాగంగా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిస్తున్న హోప్ ఆఫ్ హాంగర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అలేఖ్య, వెంకటేశ్వరరావు, రవి కిరణ్, మీరయ్య, ఇందిరరాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *