పటాన్చెరు:
తెలంగాణ ఆడబిడ్డల ప్రత్యేక పండగ బతుకమ్మ సంబరాలు నేటి నుండి మొదలవడంతో పటాన్చెరు పట్టణంలోని వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో పండుగ వాతావరణం సంతరించుకున్నాయి.
గొనెమ్మ బస్తీలోని గొనెమ్మ ఆలయం మరియు జేపీ కాలనీ లోని గుడి వద్ద జరిగిన బతుకమ్మ సంబరాలలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు హాజరవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మొదలవడంతో పట్టణం లోని వీధులన్నీ ఆడబిడ్డల ఆటపాటలతో నూతన కల సంతరించుకున్నాయని అన్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా అన్ని వీధులలో వీధి దీపాలు,అలాగే కాలనీలలో, చెరువుల వద్ద ప్రత్యేకంగా పారిశుధ్య పనులను చేయించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ హారిక విజయ్ కుమార్ గారు,తదితరులు పాల్గొనడం జరిగింది.
