బంగారు తెలంగాణ‌,ఆరోగ్య తెలంగాణ కోసం అందరికీ కార్పొరేట్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి – డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్

Hyderabad politics Telangana

మనవార్తలు ,హైదరాబాద్

బంగారు తెలంగాణ సాకారంలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు హెల్త్ ఫోక‌స్ ఆల్ అనే సంస్థ ముందుకు వ‌చ్చింది. పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి కార్పోరేట్ వైద్యాన్ని అందించేందుకు త‌మ వ‌ద్ద ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయ‌ని…వీటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు హెల్త్ ఫోక‌స్ ఆల్ ప్ర‌తినిధులు డాక్ట‌ర్ తిప్ప‌రాజు వెంక‌ట న‌గేష్ తెలిపారు.ఆరోగ్య తెలంగాణ ల‌క్ష్యంగా ముందుకువెళ్తున్న ప్ర‌భుత్వానికి చేదోడుగా నిలించేందుకు హెల్త్ ఫోక‌స్ ఆల్ అనే సంస్థ ద్వారా కార్య‌క‌లాపాలు ప్రారంభించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌లో జ‌రిగే లావాదేవీల్లో మూడు శాతం హెల్త్ సెస్ విధించ‌డం ద్వారా కొంత నిధిని స‌మ‌కూర్చుకుంటే చాల‌ని తెలిపారు. ఈ నిధి ద్వారా అందరికి ఉచిత కార్పోరేట్ వైద్యం అందిచ వ‌చ్చిని వివ‌రించారు .

హైద‌రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్ లో హెల్త్ ఫోక‌స్ ఆల్ సంస్థ ప్ర‌తినిధులు డాక్ట‌ర్ తిప్ప‌రాజు వెంక‌ట న‌గేష్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఎన్నో కేసుల్ని చూశానని తెలిపారు . పేదలకు ఆరోగ్యశ్రీ వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఉచిత సేవలు ల‌భిస్తున్నాయ‌ని…ఇవి ఒక వ్య‌క్తికి ఒక‌సారి మాత్రమే ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు అర్హ‌త ఉంద‌ని తెలిపారు. రోగుల‌కు ప్ర‌తి ఏటా ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత కార్పోరేట్ వైద్యం అందించేలా త‌మ సంస్థ ప‌రిష్కారం చూపుతుంద‌ని తెలిపారు.యూకె లాంటి దేశాల్లో అంద‌రికి కార్పోరేట్ ఆరోగ్య బీమా ప‌థ‌కం ఉంద‌ని ఇదే త‌ర‌హాలో మ‌న తెలంగాణ రాష్ట్రంలో అమ‌లు చేయాల‌ని హెల్త్ ఫోక‌స్ ఆల్ సంస్థ ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు ,స‌ల‌హాలు ఇస్తాన‌ని చెబుతోంది.

ప్రతీ ఒక్కరికి కార్పొరేట్ వైద్యం హెల్ ఫోక‌స్ ఆల్ సంస్థ ల‌క్ష్య‌మ‌ని అందుకోసం వైద్యులంతా క‌లిసి కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళ్తున్న‌ట్లు వెంక‌ట న‌గేష్ తెలిపారు . అతి తక్కువ భారంతో ప్రభుత్వం ‘ ఆరోగ్య నిధి ’ని ఏర్పాటు చేస్తే ఇది సుసాధ్య‌మ‌వుతుందంటున్నారు.బంగారు తెలంగాణలో ప్రతీ రోజు ఎన్నో ఆర్దిక లావాదేవీలు జరుగుతుంటాయని.. అందులో ప్రతీదానిపై, లేదంటే వీలైనన్ని ఎక్కువ ఆర్దిక కార్యకలాపాలపై ‘ ఆరోగ్య బీమా’ సెస్ మూడు శాతం విధిస్తే చాల‌ని వివ‌రించారు. ఉదాహ‌ర‌ణ‌కు హోటల్లో కాఫీ మొదలు కోట్లు ఖర్చు చేసి కట్టే ఇళ్ల వరకూ అన్నిటిపైనా మూడు శాతం ఆరోగ్య బీమా సెస్ విధిస్తే అందరికి ఉచిత కార్పోరేట్ వైద్యం అందించ‌వ‌చ్చిన తెలిపారు.

మైక్రోసాఫ్ట్ కు చెందిన ప్ర‌తినిధులు సైతం త‌మ‌తో జ‌త‌క‌ట్టార‌ని ఈ స‌రికొత్త విధానంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ రూపొందించిన‌ట్లు వెంక‌ట న‌గేశ్ తెలిపారు.
ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్ స‌హ‌కారంతో మైక్రోసాఫ్ట్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ టీ సురేంద్ర స‌హ‌కారం తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు .ప్ర‌తి లావాదేవీల‌పై ప్ర‌భుత్వం మూడు శాతం ప‌న్ను విధించి ఆరోగ్య నిధిని ఏర్పాటు చేస్తే  బీమా సంస్థ‌ల‌తో ప్ర‌భుత్వం బ‌ప్పందం చేసుకుంటే ఈ ప‌థ‌కం విజ‌య‌వంతమవుతుంద‌ని టీ సురేంద్ర తెలిపారు . ఈ సమావేశం లో శ్రీధర్ రావు, డాక్టర్ శివ కుమార్, డాక్టర్ అమన్ చంద్ర, విజయ్ పాటిల్ త‌దిత‌రులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *