– గీతం కార్యశాలలో సెన్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి
మనవార్తలు ,పఠాన్ చెరు:
కరోనా మహమ్మారి ఎలా కదులుతుంది , ఎలా వ్యాపిస్తుంది , దానికి ఎలా కళ్ళెం వేయగలిగాం వంటివన్నీ ద్రవాల భౌతిక శాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.ఎన్ . చెప్పారు . గీతం గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వ తేదీ వరకు ‘ ద్రవాల భౌతిక శాస్త్రం : పద్ధతులు , వినియోగం ‘ ( ఫిజిక్స్ ఆఫ్ ఫ్యూయిడ్స్ : మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ ) అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల కార్యశాల మంగళవారం ప్రారంభమైంది . ఇందులో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , ద్రవాల భౌతిక శాస్త్రం అంతర్ విభాగ పాఠ్యాంశమని , ఇది చాలా విస్తృతమైనదని , రసాయన , జీవ శాస్త్రాలతో పాటు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ముడిపడి ఉంటుందన్నారు .
ఈ మూడు రోజుల కార్యశాల ముగిసే సమయానికి సదస్యులంతా వాటిని ఎలా ఉపయోగించాలి అనే దానిపై మంచి అవగాహన ఏర్పరచుకోగలరని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు . ఐఐటీ ఖరగ్పూర్లోని ఫ్యాకల్టీ ఆఫ్ సెన్సైస్ డీన్ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ ఈ వర్క్షాపు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు . ‘ ద్రవ ప్రవాహానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు ‘ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు . ఆ తరువాత గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రెజా ‘ బౌండరీ లేయర్ థియరీ ‘ అనే అంశంపై కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వంశీకృష్ణ నార్ల ‘ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేషన్స్ ‘ అనే అంశాలపై ప్రసంగించారు . కార్యశాల నిర్వాహకుడు ప్రొఫెసర్ కె.ఎం.ప్రసాద్ మాట్లాడుతూ , ముఖాముఖి వివరణ , సాఫ్ట్వేర్ వినియోగం వంటి కార్యక్రమాల ద్వారా ఇందులో పాల్గొనేవారికి శిక్షణ ఇవ్వడం ఈ వర్క్షాప్ ప్రత్యేకతగా అభివర్ణించారు . విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జీఏ రామారావు , పలువురు అధ్యాపకులు , పరిశోధక విద్యార్థులు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…