పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా మే 4న పటాన్చెరులో నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గ స్థాయి చర్చి పాస్టర్ల సమావేశాన్ని జయప్రదం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరులో నియోజకవర్గ ముఖ్య చర్చి పాస్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో తెలంగాణ వాదం బలంగా వినిపించాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు, సొంత నిధులతో 30కి పైగా చర్చిలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. వీటితో పాటు క్రిస్టియన్ల కోసం ఐదు ఎకరాలను స్మశాన వాటిక కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. మెదక్ బరిలో నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో.. పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయకుమార్, నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు..
