పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పైన 50 లక్షల రూపాయల సొంత నిధులతో సూర్య భగవానుడు దేవాలయం నిర్మించబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ సందర్భంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన ఛట్ పూజ ఉపవాస దీక్షల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకగా పటాన్చెరు నియోజకవర్గ నిలుస్తాం అని తెలిపారు. నియోజకవర్గంలో నివసిస్తున్న ఉత్తర భారతీయుల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తగు ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు.గతంలో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం ఉదయం 07:30 గంటలకు సూర్య భగవానుడి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు అఫ్జల్, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.