మనవార్తలు ,పటాన్ చెరు:
నిమ్న జాతుల అభ్యుదయానికి నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని యువజన నాయకుడు శివారెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ఐనోల్ గ్రామంలో తన సొంత ఖర్చు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాయవాదిగా రాజకీయవేత్తగా ఆర్థిక సంఘ సంస్కర్తగా ఎన్నో సేవలు అందించిన మహనీయుడు అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటానికి నాంది పలకడం జరిగిందని తద్వారా సొంత రాష్ట్రాన్ని తద్వారా సొంత రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని తెలిపారు. రిజర్వేషన్లతో అట్టడుగు వర్గాల వారికి సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచి జరిగిందన్నారు.నేటి తరానికి ఆయన ఆలోచనలు అనుసరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి,మోహన్ రెడ్డి,జంగాయా,శ్రీశైలం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.