ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల పట్ల పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ కార్పొరేటర్లు
అమీన్పూర్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం బైకాట్ చేశారు. పాలక వర్గం తీరును నిరసిస్తూ సమావేశం నుండి బయటికి వచ్చారు. సమావేశం చర్చించే ఎజెండా మూడు, 4 రోజుల ముందు పంపించకుండా కేవలం ఒక రోజు ముందు రాత్రి 11 గంటలకు పంపిస్తే ఎలా అని 15 వ వార్డు కౌన్సిలర్ కాట సుధా ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల పట్ల పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.రాత్రి 11 గంటలకు ఎజెండా పంపించి ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు సరి కాదన్నారు. ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల నోళ్లు మూయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయంపై తాను జాయింట్ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు లావణ్య శశిధర్ రెడ్డి, సునీత, పద్మావతి గోపి, మున్నా తెలిపారు. కౌన్సిల్ నిర్వహణ తీరుపై కాంగ్రెస్ కార్పొరేటర్లు తప్పు పట్టారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ముందు రోజు తహతమకు ఎజెండాను పంపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు . ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలిపారు .అమీన్పూర్ మున్సిపల్ అధికారుల వ్యవహరించిన తీరు పై కాంగ్రెస్ కార్పొరేటర్లు తప్పు పడుతున్నారు.