కలెక్టరేట్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫిర్యాదు…
హైదరాబాద్:
సంగారెడ్డి జిల్లా… అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంను కాంగ్రెస్ కౌన్సిలర్లు బాయ్ కాట్ చేశారు. పాలక వర్గం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు . సమావేశం అజెండాను కనీసం మూడు ,నాలుగు రోజుల ముందు పంపాలని .రూల్స్ ఉన్న …
పాలకవర్గం తుంగలోకి తొక్కిందని ఆరోపించారు. కేవలం ఒక రోజు ముందు ఎజెండాను తమకు పంపిస్తే …మున్సిపల్ సమస్యలను చర్చించే అవకాశం లేకుండా చేశారని కాంగ్రెస్ కౌన్సిలర్లు అంటున్నారు. దీనికి నిరసనగా కౌన్సిల్ సమావేశ బైకాట్ చేసినట్లు 15 వార్డు కౌన్సిలర్ కాట సుధా రాణి తెలిపారు.
ప్రతిపక్ష కౌన్సిలర్ల పట్ల చిన్న చూపు….
కౌన్సిల్ సమావేశం ఎజెండా కనీసం మూడు, 4 రోజుల ముందు పంపించకుండా కేవలం ఒక రోజు ముందు పంపిస్తే ఎలా అని కౌన్సిలర్ కాట సుధా ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల పట్ల పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై తాను జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఆమె తెలిపారు కౌన్సిలర్లు లావణ్య శశిధర్ రెడ్డి, సునీత, మున్నా పాల్గొన్నారు.
