మనవార్తలు , శేరిలింగంపల్లి :
డిజిటల్ మార్కెటింగ్ మరియు వ్యాపార దక్షత లో 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న శ్రీనివాస్ చే రూపొందించిన మొట్టమొదటి తెలుగు బిజినెస్ మొబైల్ ఆప్ శ్రీనివాస్. బి ఎల్ జెడ్ ను శనివారం తెలంగాణ గవర్నమెంట్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా ప్రారంభిoచినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ ఈ విన్నూత్న ప్రయత్నాన్ని మెచ్చుకొని శ్రీనివాస్ అండ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలియ జేశారు.
ఏ బిజినెస్ అయినా పెట్టే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, అనుమతులు మొదలుకొని ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ వినియోగదారునికి అందేజేసే వరకు అవసరమైన మార్కెటింగ్ మరియు స్ట్రాటజీస్ తెలుసుకొనేందుకు శ్రీనివాస్. బి ఎల్ జెడ్ మొబైల్ యాప్ ను ఉచితంగా వాడవచ్చని శరకడం శ్రీనివాస్ తెలిపారు. అంతే కాకుండా బిజినెస్ లోన్స్, గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ మరియు నూతన వ్యాపార అవకాశాలకు సంభందించి ఎప్పటికప్పుడు వీడియోలు, సర్వేలు ఈ మొబైల్ యాప్ లో అప్ లోడ్ చేస్తూ ఉంటామని ఆయన పేర్కొన్నారు.
గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఈ యాప్ ను ప్రతీ ఒక్కరూ ముఖ్యంగా పార్ట్ టైం సంపాదన గురించి చూసే వారందరూ ఇన్ స్టాల్ చేసుకొని లబ్ది పొందొచ్చని శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ డిజి ప్రతినిధి పెద్దారెడ్డి, సీమాఫ్ గ్లోబల్ మేనేజర్ తరన్ జీత్ కౌర్ తదితరులు పాల్గొన్నారు.
