తప్పుడు వార్తలను ఖండిస్తున్నాo – సి ఐ ఎఫ్ ఎల్ ప్రతినిధులు

Hyderabad politics Telangana

_వాస్తవాలు తెలుసుకుంటే మంచిది

_లేదంటే పరువు నష్టం దావా వేస్తాం – సి ఐ ఎఫ్ ఎల్ ప్రతినిధులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఆలిండ్ కంపెనీ ల్యాండ్ కబ్జా అంటూ కొన్ని ప్రచార సాధనాల్లో వచ్చిన వార్తలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కమర్షియల్ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ లిమిటెడ్ (సి ఐ ఎఫ్ ఎల్ ) ప్రతినిధులు. పత్రికా ప్రకటనను విడుదల చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 137, 138 మరియు 139 సర్వేనెంబర్ల లోని 45 ఎకరాల భూమిని 1959 సంవత్సరంలో, 94, 95,96,97,102 మరియు 103/1 అండ్ 2 లో గల 60 ఎకరాల భూమిని 1960 లో హైదరాబాద్ నేషనల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వద్ద. కమర్షియల్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ లిమిటెడ్ పేరుతో కొనుగోలు చేశామని తెలిపారు. కాగా ఇందులో నుండి 1961 సంవత్సరంలో 45 ఎకరాలను ఆలిండ్ కంపెనీకి విక్రయించామని పేర్కొన్నారు.

మిగిలిన భూమిని కమిడి రియాలిటీ. ప్రయివేట్ లిమిటెడ్ మరియు కె ఎన్ ఆర్ ప్రతినిధులకు. 2021 లో అమ్మామని తెలిపారు. ఇటీవల సదరు అమ్మామని, కమిడి రియాలిటీ ప్రయివేట్ లిమిటెడ్ మరియు కె ఎన్ ఆర్ ప్రతినిధులు సదరు భూమిలోకి వెళ్లి చదును చేసుకోగా దీన్ని ఓర్వలేని ఆలిండ్ కంపెనీ ప్రతినిధులు తమ భూమి కొనుగోలు దారుల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ఆసరా గా చేసుకొని కొన్ని పత్రికలు, ప్రచారసాధనాలు నిజానిజాలు తెలుసుకోకుండా ఆక్రమణ, చొరబాటు అంటూ తప్పుడు వార్త కథనాలు ప్రచురించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆలిండ్ కంపెనీ వారు కార్మికుల శ్రేయస్సు కోసం కంపెనీ ని నడపకుండా దాన్ని మూసేసి కార్మికులను రోడ్డుపాలు చేసి ఇపుడు సినిమా షూటింగ్ లకు స్థలాన్ని లీజుకిచ్చుకుంటు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

కోర్టు ఆదేశాలనుసారం రెవెన్యూ డిపార్ట్ మెంట్ వారు సర్వే చేసి ఇచ్చాకే తమ కొనుగోలు దారులు సదరు స్థలం లోకి వెళ్తే దాన్ని చొరబాటు అని ఎలా అంటారని ప్రశ్నించారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ చేసిన సర్వే నే తప్పంటు ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. మొగాన్ని మొత్తి మొర్రో మొర్రో అన్నట్లు వారే తప్పు చేస్తూ ఆ తప్పులను ఇతరులపైకి దొప్పడం సరైంది కాదన్నారు. దొంగే దొంగా, దొంగా అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ కె ఎన్ ఆర్ సంస్థ ను అభాసు పాలు చెయ్యాలని చూస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *