వెనుజులపై అమెరికన్ దాడిని ఖండించండి సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

అమెరికన్ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని సిఐటియు జిల్లా కోశాధికారి కేరాజయ్య అన్నారు. వెనుజుల పై అమెరికన్ దాడిని నిరసిస్తూ ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణం లో శ్రామిక్ భవన్ నుంచి జాతీయ రహదారి వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వెనిజులపై దాడిని ప్రపంచం మొత్తం ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఒక దేశం పై అమెరికా పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు, టెర్రరిస్టుల కంటే భయంకరంగా అమెరికన్ సైన్యం విరుచుకుపడిందన్నారు.ఒక దేశ అధ్యక్షుడు భవనంపై రాత్రిపూట దాడి చేసి, ప్రజల ప్రాణాలు తీసి అధ్యక్షుని అతని భార్యని కిడ్నాప్ చేయడం ఏమిటని, అమెరికాకు ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు.

అమెరికా చేస్తున్న అరాచకాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని,అమెరికన్ సామ్రాజవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు, గత అనేక సంవత్సరాల నుంచి వెనుజుల దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని, తమ చెప్పు చేతిలో ఉంచుకోవాలని అమెరికా కోరుకున్నదన్నారు, ప్రపంచంలోనే వెనుజులలో ప్రత్యమయ ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న దేశమని, అది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెనిజులలో ఇంధన నిక్షేపాలు గనినీయంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

ఇంధనం పైన పెత్తనం కోసమే అమెరికన్ దాడి చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు వెనుజుల అధ్యక్షుడి భార్య ఎక్కడ ఉందో కూడా ప్రకటన చేయలేదని, వెంటనే మీడియాకు చూపించాలని, వెనిజుల నుంచి అమెరికన్ సైన్యం వెంటనే వెనుకకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అమెరికన్ దానిని భారత దేశ ప్రజలు, సంఘాలు, పార్టీలు ఖండించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, సాయన్న, నరసింహారెడ్డి, నరసింహులు, నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *