గ్రామాల సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో కలిసి గుమ్మడిదల మండలంలో ఎన్ఆర్ఇజిఎస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మనవార్తలు ప్రతినిధి , గుమ్మడిదల :

గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, రామిరెడ్డిబావి, కానుకుంట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో అంతర్గత రహదారులతో పాటు గ్రామాల మధ్య అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో సిఎస్ఆర్ నిధులు సైతం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, పంచాయతీరాజ్ డిఈ సురేష్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, బాల్ రెడ్డి, షేక్ హుస్సేన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *