మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం చెందుతుందన్నారు యాంకర్ సుమ కనకాల అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి కె పి హె బి లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనే ఆటిజం, ఏడి హెచ్ డి ఇష్యూస్ కోసం చిన్నపిల్లలకు పంచకర్మ చికిత్సలను అందించే ఏకైక హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ ను ఆమె ప్రారంభించారు. సినీ నటి సుమ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య అనేది చాలా పురాతనమైన వైద్యం ఇది ఎక్కువగా కేరళ లో చేస్తారు ఇపుడు అందరూ అక్కడకి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇపుడు మన హైదరాబాద్ ఆయుర్వేద వైద్య చేస్తున్నారు. మరిఇపుడు చిన్న పిల్లలో ఆటిజం అనేది ఎక్కువగా వస్తుంది దాని సరే వైద్య చేస్తే తొందరా నయమై పోతుంది. అత్యవసరం అయితేనే అల్లోపతి వైద్య విధానాన్ని అనుసరించాలి తప్ప సాధారణ పరిస్థితిలో ప్రకృతి సిద్ధంగా వ్యాధులను నయం చేసే ఆయుర్వేద వైద్య అనుసరించాలని అన్నారు. ప్రకృతిలో లభించే పదార్ధాలతో చేసిన మందులు మానవుని శరీరం పై చెడు ప్రభావం చూపించకుండా వ్యాధులను నయం చేస్తాయని చెప్పారు. శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్, మరియు ఆయుర్వేద వైద్య నిపుణురాలు అయిన డాక్టర్. బీశెట్టి శాంతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనే ఆటిజం, ఏడి హెచ్ డి ఇష్యూస్ కోసం చిన్నపిల్లలకు పంచకర్మ చికిత్సలను అందించే ఏకైక హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ 2011లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది, మొట్టమొదటి హాస్పిటల్ వైజాగ్ లో ప్రారంభించబడింది.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి బెంగుళూరు మరియు హైదరాబాద్ లో ఇప్పటికే తమ సేవలను అందిస్తూ వస్తున్నారు.