మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 41 లోని ప్లాట్ నెంబర్ 59 ఏ, లోని 100 గజాలలో 6 అంతస్థుల అక్రమ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని, ఇది నగరంలోని నడిబొడ్డిన అత్యంత రద్దీ ప్రాంతoలో ఉందని, ఈ అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మియాపూర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముద్దంగుల తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులకు పిర్యాదు చేశారు. పరిమితులకు మించి ఎటువంది షరతులకు లోబడి నిర్మాణం జరగడం లేదని, ఇది ఆత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు..6 ఫ్లోర్ ల భవనానికి తీసుకోవాల్సిన అనుమతులు ఏమి లేవని, నిర్మాణ పనులు ఆపాలని కోరారు. అగ్నిమాపక నిబంధనలు ఏమి లేవని, ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.ప్రమాదకరంగా జరుగుతున్న నిర్మాణం పై వెంటనే చర్యలు తీసుకొని, ఈ ఆక్రమ నిర్మాణం పై, నదరు బిల్డింగ్ ను కూల్చివేయాలని అయన కోరారు.