_ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆహ్వానించిన ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహరాజ్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ఆహ్వాన పత్రికను అందించారు. మార్చి 9వ తేదీ వరకు మహారాజు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 5వ తేదీన డాక్టర్ శ్రీ మహంత్ సిద్దేశ్వరానంద గిరి మహరాజ్ పట్టాభిషేకం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శతజయంతి ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ చారి పాల్గొన్నారు.