పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపిన సీఎం కేసీఆర్ పర్యటన

politics Telangana

_ఎమ్మెల్యే జిఎంఆర్ ను మళ్లీ గెలిపించండి

_ముఖ్యమంత్రి కెసిఆర్

_సీఎం కేసీఆర్ కు అపూర్వ ఘన స్వాగతం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని మూడోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పటాన్చెరు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు.మియాపూర్ నుండి పటాన్చెరువు వరకు మెట్రో రైల్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 30 కోట్ల రూపాయల చొప్పున 90 కోట్ల రూపాయలు, జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్లకు 10 కోట్ల రూపాయల చొప్పున 30 కోట్ల రూపాయలు, 55 గ్రామపంచాయతీలకు 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.తనను ఎప్పుడు కలిసిన మీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసే వారిని వారి కోరికను మన్నించి అతి త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో ఐటీ పరిశ్రమ ఏర్పాటు ఏర్పాటు కోసం త్వరలోనే ఐటీ శాఖ మంత్రి రామారావును పంపిస్తామని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సంవత్సరంలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిపారు. 1994 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యేగా సదాశివరెడ్డి పనిచేసిన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం పటాన్చెరువులోని గల్లి గల్లి తిరగడం జరిగిందని గుర్తు చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పటాన్చెరు ప్రాంతంలో నిరంతర విద్యుత్తు కోసం పరిశ్రమల యజమానులు, కార్మికుల ధర్నాలు చేసే పరిస్థితులు ఉండేవని అన్నారు. నేడు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందించడం జరుగుతుందని గుర్తు చేశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి నాయకులు ప్రజలను అయోమయానికి గురి చేయడంతో పాటు లేనిపోని అపోహలు సృష్టించారని అన్నారు.

ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గతంలో ఆంధ్రాలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసే పరిస్థితులు ఉండేవని.నేడు తెలంగాణలో ఒక ఎకరా భూమి అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చని వ్యాఖ్యానించారని అన్నారు.పటాన్చెరులో ఎకరా భూమి 30 కోట్లకు పోతుంది అంటే ఇది బంగారు తెలంగాణకు ప్రతిరూపం అన్నారు.

మంత్రి హరీష్ రావు వచ్చాక వైద్యరంగం పరుగులు పెడుతుందని ఆనందం వ్యక్తం చేశారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో 15000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఈ విషయం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు..రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశంలో ఎక్కడా లేవని, ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆచరిస్తున్నాయని అన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే రాష్ట్ర రాజధాని కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావని తెలిపారు.వచ్చే ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు.సీఎం కేసీఆర్ గారికి 56 ఇంచుల ఛాతి లేదు కానీ ఎక్కడ ఎవరికి ఏం కావాలో తెలిసిన మహోన్నత నాయకుడు అన్నారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవార్డుల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్రానికి లభిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో పవర్ హాలిడేలకు కేరాఫ్ అడ్రస్ గా పారిశ్రామిక ప్రాంతాలు ఉండేవని. నేడు నిరంతర విద్యుత్తు అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు.జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేశామని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్న ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ బిడ్డలు వైద్య విద్య కోసం ఇతర దేశాలు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేశామని తెలిపారు.వైద్య ఆరోగ్య రంగంలో సీఎం కెసిఆర్ చరవతో డెబ్బై శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని తెలిపారు.

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు గొప్ప శుభదినం అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో అభివృద్ధిలో దూసుకెళ్తామని తెలిపారు. నూతన ఆసుపత్రి నిర్మాణంతో నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గంలో నూతన పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలు డివిజన్లు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, మియాపూర్ నుండి పటాన్చెరు వరకు మెట్రో రైలు పొడిగించాలని సీఎం కేసీఆర్ కు అందించగా సీఎం కేసీఆర్ స్థానికులంగా స్పందించారు. అనంతరం సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ వినాయకుడి ప్రతిమతో ఘనంగా సన్మానించారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజున గురువారం సభా స్తరిపై ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు.ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గం నుండి ప్రజల పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభా ప్రాంగణం తో పాటు టోల్గేట్ నుండి ముత్తంగి వరకు వేల సంఖ్యలో ప్రజలు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *