_కారణజన్ముడు సీఎం కేసీఆర్
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంతో పాటు భావి భారతానికి దశాబ్ దిశను నిర్దేశించిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతుందని అన్నారు. ఆయన స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

