మనవార్తలు,జిన్నారం
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని, జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు . అనంతరం ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు స్ఫూర్తితో అనేక సంవత్సరాలు వాళ్ళ అనుభవాలను రాబోయే దశాబ్దాల ను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ నీ తనఅహంకార ధోరణి తో అవమానపరచడం బాధాకరమని తెలిపారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పేంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు ఎమ్మెల్యేలు ఎంపీల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదారం రాజు గౌడ్, మాజీ ఎంపిటిసి పుట్టి భాస్కర్, ఎస్సీ డిపార్ట్మెంట్ పటాన్చెరు కన్వీనర్ కొనింటి మహేష్, యనగండ్ల నరేందర్, పోచమ్మల స్వామి ,పల్నాటి భాస్కర్ ,కంది ఎల్లయ్య ,మాదారం వార్డు సభ్యులు కుమార్ భవాని ,అశోక్ ,పట్నం శీను ,సీతారాం రాజు సింగ్, సత్యనారయణ లక్ష్మన్, వెంకటేష్ .రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
