అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడా గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ బుధవారం లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత, శారీరిక దారుఢ్యం తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో తగు ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మూలంగా గ్రామీణ స్థాయి క్రీడాకారులు నేడు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్నారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, సర్పంచులు కృష్ణ, నితీశా శ్రీకాంత్, భాస్కర్ గౌడ్, మాధవి రవి, లలిత మల్లేష్, మల్లేష్, సీఐ శ్రీనివాసులు రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎంపీడీవో మల్లీశ్వర్, ఎంఈఓ రాథోడ్, సీనియర్ నాయకులు రాజు, జ్ఞానేశ్వర్, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
