పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అమెరికా సామ్రాజ్యవాదం పై పోరాడాల్సిన అవసరం ఉందని అదేవిధంగా క్యూబో ప్రజలకు మనమంతా అండగా నిలబడదామని సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కేరాజయ్య పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో తోషిబా పరిశ్రమలో కార్మికులు క్యూబా సంఘీభావం నిధిని రాజయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూబా ప్రజలకు ప్రజలంతా అండగా నిలబడాలని ఆయన కోరారు. క్యూబా ప్రజలను అమెరికా సామ్రాజ వాద విధానాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక షరతులు విధిస్తున్నదని విమర్శించారు. అమెరికా గత 40 సంవత్సరాల నుంచి క్యూబా దేశాన్ని వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ క్యూబా ప్రజలు అమెరికాకు లొంగలేదని ఆయన గుర్తు చేశారు. అమెరికన్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే పోరాటంలో అగ్రభాగాన ఉన్న దేశం క్యూబా అన్నారు. అమెరికా అనేక ఆంక్షలు విధించిందని, దిగుమతులు రానీయడం లేదని కనీసం మందులు హారపు వస్తువులు చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు సైతం రాకుండా అడ్డుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ఎర్రజెండా కింద గత అనేక సంవత్సరాల నుంచి నిలబడుతున్నారని, అమెరికాకు లొంగే ప్రసక్తే లేదని లేదని ఎర్రజెండాన్నే వారిని ముందుకు తీసుకపోతామని క్యూబా ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఎలాగైనా కమ్యూనిస్టులను అధికారం నుంచి కూల్చాలని అనేక కుట్రలు చేస్తుందని ఆయన అన్నారు.. సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపుమేరకు సంఘీభావం నిధినిని అన్ని చోట్ల విస్తృతంగా వసూలు చేస్తున్నామని ఆయన తెలిపారు అమెరికన్ సామ్రాజ్యవాదం కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అమెరికా ఏనాడు కూడా ఇతర దేశాలకు సాయపడగ పొగా పెత్తనం చెల్లాయిస్తుందని విమర్శించారు.
ప్రత్యేకంగా కమ్యూనిస్టు దేశాలను కూల్చడానికి సిద్ధపడుతుందని, కమ్యూనిస్టులను అధికారం నుంచి కూల్చడానికి అనేక కుట్రలు కుతంత్రాలు మొదటి నుంచి అమెరికా సామ్రాజ్యవాదం చేస్తుందని ఆరోపించారు. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడితేనే ప్రపంచ శాంతి వస్తుందన్నారు. ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు పెడుతున్నది అమెరికన్ కాదా అని ప్రశ్నించారు. పన్నులపై దేశ ప్రధానమంత్రి నోరు విప్పాలని ,దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని, అమెరికాకు ఘాటుగా సమాధానం ఇవ్వాలని అన్నారు.దేశ స్వాతంత్రాన్ని, దేశాన్ని అమెరిక కు తాకట్టు పెట్టొద్దని ఆన్నారు, ప్రపంచంలో అన్ని దేశాలు క్యూబాకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అనంతరావు, నాయకులు శ్రీధర్, ప్రకాష్ ,బంగార్రాజు, కృష్ణయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
