-పాశమైలారం లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల్లో
సిఐటియు యూనియన్ ఏర్పాటు
-బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు నిరంతరము పాటుపడుతుందని బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. మండలంలోని ఐడిఏ పాశమైలారం పారిశ్రామిక వాడ లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణం లోని శ్రామిక్ భవన్ లో జరిగిన బిస్లెరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ కార్మికుల సమావేశానికి ముఖ్యఅతిథిగా అతిమేల మాణిక్ హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుతంగా ఐడిఏ పాశమైలారం ఫేస్ – 3 లో గల ” బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ” పరిశ్రమలో కార్మికులు అందరూ ఐక్యంగా సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నారని, కార్మికులందరికీ సిఐటియు అభినందనలు తెలియజేస్తుందన్నారు.
కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. యూనియన్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని రిజిస్ట్రేషన్ కాఫీ జతపర్చి యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించి త్వరలోనే యూనియన్ ఇంట్రడక్షన్ జాయింట్ మీటింగ్ ఇస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. యాజమాన్యం యూనియన్ కు సహకరించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
యూనియన్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని రిజిస్ట్రేషన్ కాఫీ జతచేస్తూ కార్మిక శాఖ అధికారులు డిప్యూటీ లేబర్ కమిషనర్, జాయింట్ లేబర్ కమిషనర్, సిఐ భానూర్, పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ కు లెటర్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం యూనియన్ కృషికి సహకరించాలని అన్నారు.ఈ సమావేశంలో సిఐటియు పటాన్ చెరు ఏరియా నాయకులు బి నాగేశ్వరరావు, ఐడిఏ పాశమైలారం క్లస్టర్ నాయకులు రాజు, బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఎన్.శేఖర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జాయింట్ సెక్రెటరీ అజయ్ ఠాకూర్, కోశాధికారి నవీన్ కమిటీ సభ్యులు రాము నాయక్, అమిత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
