పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
యేసు క్రీస్తు బోధనలు ఆదర్శనీయం అని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్కుల్ పరిధిలోని బ్యులా చర్చ్ లతో పాటు పలు చర్చిలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్బంగా క్రైస్తవ సోదరులకు కేక్ లను పంపిణీ చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ మానవుడిగా ప్రజల మధ్యనే నడయాడి సమాజానికి శాంతి సందేశం అందించిన దయామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు.క్రీస్తు చూపిన శాంతి మార్గం సర్వ మానవాళికి స్ఫూర్తి దాయకమని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, దయా గుణాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆదర్శనీయం మని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. అనంతరం బ్యులా చర్చ్ ఆధ్వర్యంలో కండరాల హీన సమస్యలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులకు దుప్పట్లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ సోదరులు, ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.