చిట్కుల్ సర్పంచ్ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం…
– ఒక్కరోజు ముందే అనారోగ్యంతో తల్లి మృతి
పటాన్ చెరు:
మండల పరిధిలోని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తండ్రి నీలం నిర్మల్ ముదిరాజ్ గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం నీలం మధు తల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు నీలం రాధమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతి చెంది 24 గంటలు కాకముందే తండ్రి నీలం నిర్మల్ మృతి చెందడం బాధాకరం. ఎంతో అన్యోన్యంగా భార్య భర్తలు భార్య మృతి చెందడాన్ని తట్టుకోలేని నిర్మల్ ఒకరోజు వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఒక్కరోజు వ్యవధిలోనే తల్లితండ్రులను కోల్పోయిన సర్పంచ్ మధు ముదిరాజ్ లు పలువురు రాజకీయ నాయకులు ఊరి పెద్దలు ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
