ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబనికి ఆర్థికసాయం అందించిన చిట్కుల్ సర్పంచ్

Districts politics Telangana

గుమ్మడిదల్:

ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల్ మండల్ నల్లవల్లి గ్రామంలో చిన్నపురం అంజయ్య చనిపోవడంతో వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయాన్ని నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ సర్పంచ్ గారికి తెలపడంతో వారు వెంటనే స్పందించి వారి భార్య నరసమ్మ కు 5,000 ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం గుమ్మడిదల్ ముదిరాజ్ సంఘము అధ్యక్షుడు గ్యాలరా మల్లేష్ ముదిరాజ్ చేతుల మీదగా అందించారు .

అనంతరం మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటు ,సమాజానికి , పేదవాళ్లకు సేవలు చేసినప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్,ముదిరాజ్, సంఘము మండల్ సలహాదారు గోపాల్ ముదిరాజ్, కోశాధికారి వీరేశ్ ముదిరాజ్, నల్లవల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శోభన్ ఉపాధ్యక్షుడు కృష్ణ, క్యాషియర్ పోచాలు సంఘం సభ్యులు శ్రీశైలం బద్రి చిన్న శంకరయ్య , రాములు దేవేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *