మనవార్తలు ,పటాన్ చెరు;
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీ కారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని లక్డారం గ్రామ పరిధిలోని అమర్ కుమార్తె వివాహానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 15 వేల ఆర్థిక సాయం అందించారు.
పేదింటి తల్లిదండ్రులు బిడ్డల వివాహానాకి ఎన్నో కష్టాలు పడుతున్నారని..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ అన్నలా లక్ష నూటపదహార్ల రూపాయలు అందిస్తున్నాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో తమ గ్రామ పరిధిలో వివాహం చేసుకునే పేద బిడ్డలకు తనవంతు సాయంగా సహాయం అందిస్తున్నట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు .కష్టల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు.