మనవార్తలు , పటాన్ చెరు
పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని అన్నారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాలకు పెద్దపీఠ వేశారని నీలం మధు ముదిరాజ్ అన్నారు. అనంతరం పెద్దకంజర్ల గ్రామ వార్డ్ మెంబర్ నరేష్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు యువత చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు.