– అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట
మనవార్తలు ,పటాన్ చెరు:
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవ, ప్రత్యేక కృషితో తెలంగాణ రాష్ట్రంలో మత్స్యవిప్లవం వచ్చిందని పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్కుల్ గ్రామంలో మత్స్యశాఖ అధికారులతో కలిసి 50 వేల చేప పిల్లలను ఎర్రకుంటలో వదిలారు. రాష్ట్ర ప్రభుత్వమే మత్స్యకారులు, ముదిరాజ్ సోదరులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. గతంలో పోల్చితే తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా చెరువుల్లో చేపలు కనిపిస్తున్నాయన్నారు. ఒక్క చేపలే కాకుండా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
గ్రామంలోని 3వ వార్డులో సీసీ నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అలాగే గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఎమైనా ఇబ్బందులున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు ఆదర్శంగా మారుతున్నాయన్నారు. చిట్కుల్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని, ప్రజల ఆదరాభిమానాలను ఎప్పటికీ మరచిపోనని నీలం మధు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి, వార్డు సభ్యులు కష్ణ, శ్రీను, మురళి, రాజ్ కుమార్, వెంకటేష్, ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి లతో పాటు గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొ్నారు.