30 లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 75 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 30 లక్షల 67 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, పృథ్వీరాజ్, శంకర్ రెడ్డి, శివరాజ్, రాజు, శంకర్, ప్రమోద్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
