పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులను కలుపుకుని నీలం మధు కష్టపడి పని చేసినా తృటిలో సీటు ను చేజార్చుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఫలితాలు వెలువడిన సంధర్బంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మంత్రివర్యులు కొండా సురేఖ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా ఓటమి పట్ల బెంగ పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీలం మధు ను సముదాయించారు. విజయం దగ్గర దాకా వచ్చి చేజారిందని అంతమాత్రాన బాధపడాల్సిన పనిలేదన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెమటోడ్చి కష్టపడిన తృటిలో విజయం చేజారిందని తెలిపారు. ఓటమికి సంబంధించిన కారణాలను విశ్లేషణ చేసుకొని సమన్వయంతో ముందుకు వెళ్తూ ప్రజా పాలనలో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని నీలం మధుకు సీఎం సూచించారు. నీలం మధు కు నేనున్నానని, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు