పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
‘ఏ మానవ సమాజంలోనైనా మార్పులు, పరివర్తన, అభివృద్ధి అనివార్యం. ఏ సమాజమూ స్థిరంగా ఉండదు. అది ఎల్లప్పుడూ చలనశీలంగా ఉంటుంది. కానీ ప్రతి సమాజమూ దాని పూర్వ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నడుచుకుంటుంది’ అని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఎస్.ఎన్. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నృత్య విభాగం ప్రొఫెసర్, నటి డాక్టర్ అరుణ భిక్షు అన్నారు. లలిత కళలు, వాటి ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ‘ప్రదర్శనాత్మక భారతం’ (పెర్ఫార్మేటివ్ ఇండియా) పేరిట శుక్రవారం నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో నటించడం సహజమని, దానికొక కారణం కూడా. ఉంటుందని ఆమె చెప్పారు. అలాగే ప్రజలను ఉల్లాసపరిచేందుకు, నూతనోత్తేజాన్ని ఇచ్చేందుకు కళాకారులు కళలు ప్రదర్శిస్తారన్నారు. మల్లన్నను కీర్తిస్తూ, మరికొన్ని ప్రత్యేక సందర్భాలలోనే గొల్లలు ఒగ్గు కథ చెబుతారని, ఆ సంప్రదాయం క్రమంగా మారి ఉద్యమాలకు కూడా ఊపిరిలూదిందని డాక్టర్ అరుణ చెప్పారు. నృత్య రూపకమేదో స్పష్టంగా తెలియక పోయినా పామరులు సైతం వాటిని చూసి ఉత్తేజం పొందుతారని, అలాగే మన సంప్రదాయ నృత్యాలు వ్యాపార ప్రకటనలలో కూడా ప్రచారాస్త్రాలుగా మారాయన్నారు.
కళలోనే సమ్మోహన శక్తి ఉంటుందని, రాగ-భావయుక్తంగా దానిని ప్రదర్శిస్తే జనామోదం పొందుతుందని డాక్టర్ అరుణ భిక్షు అభిప్రాయపడ్డారు.ఐఐటీ బాంబేలోని భాష సాహిత్య అధ్యయనాల విశ్రాంత ఆచార్యుడు, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు డాక్టర్ మిలింద్ మళ్లే తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ‘సమకాలీన కాలంలో ప్రదర్శనల సౌందర్యం: డిజిటల్ యుగంలో వాటి తీరుతెన్నులు’ అనే అంశంపై నిర్వహించనున్న చర్చాగోష్ఠిలో ఐఐటీ హైదరాబాద్ లోని డిజెర్జ్ విభాగానికి చెందిన డాక్టర్ దీపక్ జాన్ మాథ్యూ; కేరళకు చెందిన ప్రముఖ థియేటర్ ప్రాక్టీషనర్ ప్రొఫెసర్ చంద్ర దాసన్; సిలికాన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం-త్రిబుల్ ఐటీ హైదరాబాద్ లోని సంగీత విభాగం అధ్యాపకులు డాక్టర్ టీకేఎల్ సరోజలు పాల్గొన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన సాంప్రదాయ భారతీయ కళారూపం ‘కుటియాట్టం’ను సదస్సు ముగింపు సందర్భంగా ప్రదర్శించి సదస్యులందరినీ ఆకట్టుకున్నారు.తొలుత, ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ స్వాగతోపన్యాసం చేయగా, సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ మెథైలి మరాట్ అనూప్ వందన సమర్పణ చేశారు.
గీతమ్ లో ఘనంగా సంప్రదాయ వస్త్రధారణ దినోత్సవం….
‘పరంపర’ పేరిట ప్రతియేటా నిర్వహించే సంప్రదాయ వస్త్రధారణ దినోత్సవాన్ని (ఎత్నిక్ డే) శుక్రవారం గీతమ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా వివిధ రాష్ట్రాలు, దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ! విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వాతావారణాన్ని తీసుకొచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు . ప్రదర్శనలు, చెవులూరించే ఆహార పదార్థాల స్టాళ్ళు అందరినీ ఆకట్టుకున్నాయి.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…