మనవార్తలు ,పటాన్చెరు:
తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని సాకీ చెరువు కట్టపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సాయంత్రం విగ్రహం ఏర్పాటు చేయనున్న సాకి చెరువు కట్టపై ఏర్పాట్లు పరిశీలించారు. ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. భావితరాలకు చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.