మనవార్తలు ప్రతినిధి, మియాపూర్ :
మియాపూర్‌కు చెందిన ప్రముఖులు శ్రీ తాండ్ర మహిపాల్ గౌడ్ గారి కుటుంబంలో జన్మించిన నవజాత శిశువు ఊయల కార్యక్రమం మియాపూర్ హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో సంప్రదాయ పద్ధతుల్లో, భక్తిశ్రద్ధలతో మరియు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది.ఈ శుభకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ , శ్రీ మోహన్ ముదిరాజ్ , శ్రీ పల్లె మురళి హాజరై నవజాత శిశువును ఊయలలో ఉంచి ఆశీర్వచనాలు అందజేశారు. శిశువు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ పెద్దలు శ్రీ రాంచందర్ గౌడ్ , శ్రీ శ్రీనివాస్ ముదిరాజ్, విజయ్, రమేష్, బాబు రావు, రత్నాచారి, సాయి తదితర కుటుంబ సభ్యులు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు శిశువుకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, విద్యాబుద్ధి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ తమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో, సంప్రదాయ వేడుకలతో అత్యంత వైభవంగా సాగింది.
