చిట్కుల్:
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తెలంగాణ లో పర్యటించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పరిశీలనకు తమిళనాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ బృందం పర్యటించింది.
చిట్కుల్ గ్రామంలో లో కేంద్రప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయని కమిటీ బృందం సభ్యులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అభివృద్ధి, కేంద్ర నిధులు ఎలా అందుతున్నాయని, వాటిని ఎలా వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు. గ్రామంలో నర్సరీని, కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ లను, ఉద్యాన వనం పరిశీలించారు.స్వయం సహాయక మహిళా సంఘాల పనితీరు, బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను వివరాలను స్థానికులను అడిగి తెలిపారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సభ్యుల బృందం పర్యటిస్తుందని కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ పిచాయ్, డాక్టర్ బాలకృష్ణన్ తెలిపారు. కరోనా అనంతరం ఏపీలో నాలుగు బృందాలు, తెలంగాణలో మూడు బృందాలు కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరును పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు . మహాత్మాగాంధీ రూరల్ ఎంప్లాయ్ గ్యారెంటీ స్కీమ్,NSDP,వాటర్ షెడ్ ,సడక్ యోజన ,ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ,సడక్ యోజన ,పంచాయతీ రాజ్ యాక్ట్ తదితర పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రేపు మరో రెండు గ్రామాలను సందర్శిస్తామన్నారు.
బృందం సభ్యుల వెంట జిల్లా, మండల అధికారులు, సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. గ్రామంలో కొనసాగుతున్న గ్రామీణ అభివృద్ధి పనులను పరిశీలించారని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.చిట్కుల్ గ్రామంలో అభివృద్ధి పనులు బాగున్నాయని కేంద్ర బృందం ప్రతినిధులు కితాబిచ్చినట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, స్వయం సహాయక సంఘాల పనితీరు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపిఓ రాజు, శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి కవిత, వార్డు సభ్యులు, ఏపీఎం శ్రీనివాస్, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
ఘనంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…