పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరువు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన 34వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 34 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న మైత్రి క్రికెట్ క్లబ్ ను ఆయన ప్రశంసించారు. ఇటీవల ఏడు కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి మైత్రి క్రీడా మైదానాన్ని ఆధునిక వసతులతో ఆధునికరించామని తెలిపారు. ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, ఎస్సార్ గ్రూప్స్ ఎం డి లు కే. సత్యనారాయణ రెడ్డి, సి. సత్యనారాయణ రెడ్డి, ఎస్సార్ ట్రస్ట్ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి,శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, క్రికెట్ క్లబ్ సభ్యులు, సీనియర్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.