మనవార్తలు , శేరిలింగంపల్లి :
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర మొదలుపెట్టి 350 రోజులకు చేరుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆ పార్టీ కోఆర్డినేటర్ ఇమామ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతిస్తానం పాదయాత్ర విజయవంతం అయిన సందర్భంగా నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు సయ్యద్ షేక్, నియోజవర్గం మహిళా కోఆర్డినేటర్ జ్యోతి రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ మహిళా కోఆర్డినేటర్ ఇక్బాల్ ఖాదర్, కొండాపూర్ డివిజన్ కోఆర్డినేటర్ యూసుఫ్ మరియు ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.