Districts

కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు

తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీ లు, రామచంద్రపురం, భారతి నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు దేశానికి దిక్సూచి గా మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశవ్యాప్తంగా అందరిచేత ప్రశంసలు అందుకున్న కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని కొనియాడారు. 8 ఏళ్ల పాలనలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ఇంటి ముంగట అభివృద్ధి ఇంటిలో సంక్షేమం అన్న చందంగా కెసిఆర్ గారి పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్వన్ గా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

పటాన్చెరు డివిజన్ పరిధిలో..

పటాన్చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. అనంతరం హజరత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రార్థనలు, చద్దర్ సమర్పించారు. ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డు ఆవరణలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కేసీఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో నిరు పేదలకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago