క్రీడల ద్వారా స్నేహపూర్వక వాతావరణం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం.. పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను శనివారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ […]

Continue Reading

ముత్తంగి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంబరాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా నాయకురాలు గడ్డ పుణ్యవతి అధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్ చెరు మాజీ జడ్పీటిసి బిఅర్ఎస్ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మరియు పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ బోగీ, సంక్రాంతి […]

Continue Reading

గీతం స్కాలర్ వసుధకు పీహెచ్ఎడీ

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ‘హైదరాబాద్ (తెలంగాణ)లోని ఐటీ సంస్థలలో సంస్థ యొక్క సుస్థిరతపై పర్యావరణ హిత మానవ వనరుల నిర్వహణ (జీహెచ్ఆర్ఎం) అభ్యాసాల ప్రభావం’పై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కె.వసుధను డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.పార్వతి శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ […]

Continue Reading

శిల్పా కళా వేదికలో ఘనంగా లొహ్రి వేడుక

– తెలంగాణ పంజాబి సభ మరియు మెఫిల్ ఇ సర్తాజ్ అధ్వర్యంలో లోహ్రి సంబరాలు శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా పంజాబ్ లో జరిగే లోహరి పండుగ సందర్భంగా తెలంగాణలో ఉండే పంజాబీలు హైదరాబాద్ లోని శిల్ప కళ వేదికలో లోహ్రి వేడుకలో పాల్గొన్నారు పంజాబి మహిళలు ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తేజ్ దీప్ కౌర్, రవీందర్ సింగ్ సర్ణ, ప్రెసిడెంట్ తెలంగాణ పంజాబి సభ , ప్రేమ్ కుమార్ కపూర్, […]

Continue Reading

భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద _గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద అని గడీల శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద ,తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో […]

Continue Reading

జ్యోతి విద్యాలయలో ఘనంగా సంక్రాతి సంబరాలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బి. హెచ్. ఈ ఎల్ టౌన్ షప్ లోని జ్యోతి విద్యాలయలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ లు మాట్లాడుతు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబo సంక్రాంతి అని, వీటికి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలే నిదర్శనమన్నారు. పండుగ ఔనత్యాన్ని చక్కగా వివరిస్తూ రంగువల్లులు, బోగి మంటలు,, గోబ్బేమ్మలతో జానపదాలతో విద్యార్థులు చక్కటి ప్రదర్శనలతో అలరించారు.

Continue Reading

అయోధ్య అక్షింతల పంపిణి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : అయోధ్య రామయ్య అక్షింతల వితరణ కార్యక్రమాన్ని శ్రీ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేకమంది రామభక్తులు హాఫిజ్ పేట్ గ్రామంలో ప్రతి ఇంటికి రామయ్య అక్షింతలు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బోయిని అనూష మహేష్ యాదవ్, బాలింగ్ యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, గౌతమ్ గౌడ్, మల్లేష్ యాదవ్, జితేందర్ యాదవ్, వెంకటేష్ గౌడ్, నవీన్ కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్,, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

గీతమ్ లో జాతీయ యువజన దినోత్సవం 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ శుక్రవారం ‘జాతీయ యువజన దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), విద్యార్థి విభాగం చరెవైతితో పాటు స్టూడెంట్ లెఫ్ట్ కలిసి దీనిని నిర్వహించారు. స్వామి నినేకానంద ఆలోచనలు, తత్వశాస్త్రంతో యువతను ప్రేరేపించడం, యువతకు మార్గనిర్దేశక శక్తిగా పనిచేయడం, దేశాభివృద్ధికి వారి ప్రయత్నాలను ప్రోత్సహించడం ఈ వేడుక లక్ష్యం. ఈ సందర్భంగా గీతం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జాతీయ భావనను […]

Continue Reading

వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్ 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు మరువలేనివని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.వడ్డే ఓబన్న 217 వ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలోని నీలం మధు తన కార్యాలయంలో వడ్డేఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా ముఖ్య అనుచరుడిగా, సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న […]

Continue Reading

అయోధ్య నుంచి ప్రపంచ సరిహద్దుల వరకు సాగుతున్న అక్షింతల పంపిణి

మహబూబ్ పేట్ ,మనవార్తలు ప్రతినిధి : అంతా రామమయం ఈ జగమంతా రామ మయం,అయోధ్య రాముని ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వాడవాడలా అయోధ్య రాముల వారి అక్షింతలు పంచే శుభ తరుణంలో ఈరోజు మక్త మహబూబ్ పేట్ గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం నుండి మేళతాళాలతో అయోధ్య రాముల వారి అక్షింతలు రామసేవక భక్త బృందాలు ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ మాహత్కార్యంలో ఆలయ కమిటీ వారు, హిందూ బంధువులు […]

Continue Reading