నవ సమాజ నిర్దేశకులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఐదు లక్షల బీమా ఇవ్వటం పట్ల హర్షం

– ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు స్వచ్ఛందంగా ఉచిత బోధన -ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు డి జగన్మోహన్ రావు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నవ సమాజ నిర్దేశకులైన( ప్రైవేటు పాఠశాలలు) ఉపాధ్యాయులకు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఐదు లక్షల ప్రమాద బీమా అందజేయబోతున్నట్లు చెప్పడం ఆయన ఉదార స్వభావానికి నిదర్శనమని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు […]

Continue Reading

మానవ జీవితంలో భాగమవుతున్న రోబోలు

గీతం సెమినార్ లో ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ రేఖా రాజా పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇళ్ల పరిశుభ్రత నుంచి రిసెప్షనిస్టులు, వెయిటర్లగా పనిచేస్తున్న సామాజిక రోబోల వరకు మానవ జీవితంలో రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాముఖ్యత పెరుగుతోందని, ఒకరకంగా రోబోట్లు మానవ జీవితంలో భాగమవుతున్నా యని ఐఐటీ హైదరాబాద్ లోని కృత్రిమ మేథ (ఏఐ) విభాగానికి చెందిన డాక్టర్ రేఖా రాజా అన్నారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో ఈనెల […]

Continue Reading

ప్రణాళికాబద్ధంగా డివిజన్ల అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్లను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్, శిశు మందిర్ కాలనీలలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నూతన కాలనీలలో […]

Continue Reading

పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాల గురుపూజోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ […]

Continue Reading

సామర్థ్యం అంచనా ప్రోత్సహకరంగా ఉండాలి

పరీక్ష పేపర్లు, మూల్యాంకన రూపకల్పన కార్యశాలలో ముఖ్య అతిథి డాక్టర్ లీనా పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి సామర్థ్యాలను పరిశీలించే పద్ధతి, మూల్యాంకన విధానాలను వారిని ప్రోత్సహించి, మరింత పూనికతో పనిచేసేలా ఉండాలని ఇఫ్లూ విశ్వవిద్యాలయం, లఖిల భారత భాషోపాధ్యాయుల సంఘం డైరెక్టర్ డాక్టర్ లీనా ముఖోపాధ్యాయ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ప్రభావవంతంగా పరీక్ష పేపర్లు అభివృద్ధి చేయడం: బ్లూమ్ యొక్క వర్గీకరణ, మూల్యాంకన రూపకల్పనో […]

Continue Reading

గీతం స్కాలర్ కొప్పుల సురేష్ కు డాక్టరేట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి కొప్పుల సురేష్,డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘యురేనియం, స్ట్రోంటియం, సీసీయంల తొలగింపు కోసం MOFs (స్థిరమైన లోహ-సేంద్రీయ (ఫ్రేమ్ వర్క్), వాటి మిశ్రమాల సంశ్లేషణ, లక్షణం’ అనే అంశంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్.సురేంద్ర బాబు […]

Continue Reading

సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి

  సింగపూర్‌ ,మనవార్తలు ప్రతినిధి : సింగపూర్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS) ఆధ్వర్యంలో బాల వినాయక పూజలను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమంలో ప్రవాస తెలుగువారు ప్రత్యక్షంగా పాల్గొని పరవశించిపోయారు. మహబూబ్‌ నగర్‌కు చెందిన శ్రీ వరసిద్దివినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ జూమ్ ద్వారా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన […]

Continue Reading

చిన్నారులకు అండగానిలిచిన ఉప్పరపల్లి ఉద్యోగ, వ్యాపారులు

వరంగల్ ,మనవార్తలు ప్రతినిధి : తల్లిమరణిండంతో అండగా ఉన్న నాన్నమ్మకాలం చేయడంతో అనాథలుగా మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశారు ఉద్యోగ, వ్యాపారవేత్తలు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రమ్య, సింధుల తల్లి సరిత మరణించగా.. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఇద్దర్ని నాన్నమ్మ కుక్కల ముచ్చాలు చేరదీసి సాకింది. గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో ముచ్చాలు మరణించడంతో వారిద్దరు అనాథలుగా మిగిలారు. దీంతో వారి పరిస్థితిని చూసి చలించిపోయిన […]

Continue Reading

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం : బిజెపి సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బలరాం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని రామచంద్రపురం లోని శ్రీనివాస్ నగర్ కాలనీ బాలవిహార్ పార్క్ వద్ద తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత.తొలి భూ పోరాటానికి నాంది పలికిన […]

Continue Reading

చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని చిట్కుల్ లో ని ఐలమ్మ కాంస్య విగ్రహం వద్ద పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ […]

Continue Reading