కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శప్రాయం ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలి, మలి దశ పోరాటాల్లో కీలక పాత్ర పోషించడంతోపాటు తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. పటాన్చెరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీల సేవలు ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పోషన్ అభియాన్-పోషణ మాసం కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సామూహిక శ్రీమంతాలు, సామూహిక అక్షరాభ్యాస […]

Continue Reading

విభిన్న యోచనే విజయానికి తొలి మెట్టు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో నోవార్టీస్ డైరెక్టర్ డాక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మనకు సౌకర్యంగా ఉన్న వాతావరణం నుంచి బయటకు వచ్చి విభిన్నంగా ఆలోచించాలని, అదే మన విజయానికి తొలి మెట్టుగా నోవార్టీస్ డైరెక్టర్ డాక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర అభివర్ణించారు. గీతం డీమ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) ఆధ్వర్యంలో ‘ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో ఆధునిక ధోరణులు” అనే అంశంపై శుక్రవారం అవగాహనా […]

Continue Reading

సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ _నీలం మధు ముదిరాజ్

చిట్కుల్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఆ మహనీయుల స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వెట్టిచాకిరి చేతులతో బంధుక్ లు పట్టించి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ […]

Continue Reading

మహిళ చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గడిలపై గళమెత్తి, తెలంగాణ రాష్ట్రంలో భూ పోరాటానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి ప్రత్యేకగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ […]

Continue Reading

గీతంలో విజయవంతంగా పైలట్ శిక్షణ కార్యశాల

ఫ్లైట్ సిమ్యులేటర్ పై శిక్షణ ఇచ్చిన కెప్టెన్ విగో పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ‘ఫ్లైట్ సిమ్యులేటర్’పై ఒకరోజు పైలట్ శిక్షణా కార్యశాలను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, శిక్షకునిగా స్పేస్ జెన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) కెప్టెన్ విగో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్ర్తి వేదాల మాట్లాడుతూ, పైలటింగ్ […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం

-మార్గదర్శనం చేసిన వక్తల ప్రసంగాలు -విజేతలకు బహుమతుల ప్రదానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్ లో బుధవారం ‘ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం- 2024 – ఘనంగా నిర్వహించారు. ‘ప్రపంచ అవసరాలను తీరుస్తున్న ఫార్మసిస్టులు’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నిపుణులు పాల్గొని ఫార్మా రంగ అభివృద్ధి. విస్తరణ, ఉపాధి అవకాశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.ఇందులో […]

Continue Reading

శాస్త్రీయ దృక్పథంతో ‘స్పచ్ఛ భారత్’ చేపట్టండి

గీతం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు డబ్బింగ్ కళాకారుడు రాజు పిలుపు గీతమ్ లో ఘనంగా ‘ఎన్ఎస్ఎస్ డే’ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం. (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు శాస్త్రీయ దృక్పథంతో చేపట్టి, నిబద్ధతతో చురుకుగా పాల్గొనాలని ఐదు నంది అవార్డుల గ్రహీత, ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు ఆర్.సీ.ఎం. రాజు పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని జాతీయ సేవా పథకం మంగళవారం నిర్వహించిన […]

Continue Reading

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం

మీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పల్లె నుండి పట్నం వరకు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పటాన్చెరు […]

Continue Reading

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఘనంగా ప్రారంభమైన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని టాన్ చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు […]

Continue Reading